మీ బావ జైల్లో, అల్లుడు ఢిల్లీలో ఉన్నారు.. నేను ఇస్తున్న ఈ సలహా పాటించండి: బాలకృష్ణతో అంబటి రాంబాబు
- టీడీపీ పగ్గాలను చేజిక్కించుకునేందుకు బాలయ్యకు ఇదే సరైన సమయమన్న అంబటి
- నందమూరి వంశ పౌరుషాన్ని నిరూపించుకోవాలని వ్యాఖ్య
- తన సలహాను పాటిస్తే మంచిదని హితవు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విజిల్ ఊదుతూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సభ్యుడు బాలకృష్ణ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ బాలయ్యకు సలహాలు ఇస్తూనే, సెటైర్లు వేశారు. బాలకృష్ణ ఎన్నడూ లేనంతగా యాక్టివ్ గా ఉన్నారని, స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి మీసం మెలేశారని అన్నారు. బాలకృష్ణగారు మీసం అసెంబ్లీలో తిప్పడం వల్ల ఉపయోగం లేదు... మీ పార్టీలో తిప్పండి అని చెప్పారు. మీ తండ్రికి మీ బావ వెన్నుపోటు పొడిచిన ఘటనను గుర్తుకు తెచ్చుకొని తిప్పాలని అన్నారు.
జన్మనిచ్చిన తండ్రి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆయనకు అండగా లేరనే అపవాదు మీమీద, మీ అన్నదమ్ముల మీద ఉందని.. ఆ అపవాదును తొలగించుకునేందుకు ఇప్పుడు సమయం వచ్చిందని అంబటి చెప్పారు. మీ బావ జైల్లో ఉన్నారని, మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నారని... పార్టీ పగ్గాలను చేజిక్కించుకునేందుకు ఇదే సరైన సమయమని సూచించారు. నందమూరి వంశ పౌరుషాన్ని నిరూపించుకోవాలని, టీడీపీని బతికించుకోవాలని చెప్పారు. ఇది తన సలహా మాత్రమేనని... తన సలహాను పాటిస్తే మంచిదని, పాటించకపోతే అథఃపాతాళానికి పోతారని అన్నారు.
చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏదో ఒకటి చేయాలనే దుష్ట ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారని అంబటి విమర్శించారు. తాను లేచి నిలబడకపోతే స్పీకర్ పై దాడి కూడా చేసేవారని అన్నారు. టీడీపీ సభ్యులు ఈరోజు కూడా ఇష్టానుసారం ప్రవర్తిస్తే స్పీకర్ కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.