ఒడిశాలో అనుమానాస్పద స్థితిలో మహిళా అసిస్టెంట్ కలెక్టర్ మృతి
- రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సస్మిత మింజ్
- 15న విధులకు వెళ్లి తిరిగి రాని సస్మిత
- 17న నగరంలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు
- వెళ్తే కలిసేందుకు నిరాకరణ
- రెండు రోజుల తర్వాత ఓ జలాశయంలో మృతదేహం గుర్తింపు
ఒడిశాలోని రూర్కెలాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సస్మిత మింజ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 15న విధులకు వెళ్లిన సస్మిత తిరిగి ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత 17న నగరంలోని ఓ హోటల్‌లో ఆమె ఉన్నట్టు తెలిసి తల్లి, సోదరుడు వెళ్లి కలిసేందుకు ప్రయత్నించారు.
తనకు విశ్రాంతి కావాలని చెప్పి ఆమె వారిని కలిసేందుకు నిరాకరించారు. ఆ తర్వాత రెండు రోజులకు ఆమె మృతదేహం పట్టణంలోని జలాశయంలో కనిపించింది. తీరంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్, చెప్పులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.