భారతీయ మహిళా శాస్త్రవేత్తకు నార్మన్ బోర్లాగ్ అవార్డ్

  • ఢిల్లీలోని ఐఆర్ఆర్ఐ శాస్త్రవేత్త స్వాతి నాయక్‌కు అరుదైన గుర్తింపు 
  • వరి సాగు చేసే చిన్నరైతులకు మేలు చేకూర్చే పరిశోధనలు చేసిన స్వాతి
  • ఆమె కృషికి గుర్తింపుగా అవార్డు ప్రకటించిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్‌ నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు. వరి పరిశోధనలో స్వాతి నాయక్‌ చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ ఏడాది ఆమెకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో (ఐఆర్ఆర్ఐ) శాస్త్రవేత్తగా ఉన్నారు. 

వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు. హరిత విప్లవ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత నార్మన్ ఇ. బోర్లాగ్ పేరిట ఈ అవార్డును నెలకొల్పారు. ఆకలిని నిర్మూలించి, ఆహారభద్రతకు కృషి చేసే 40 ఏళ్లలోపు వయసున్న శాస్త్రవేత్తలకు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తారు.


More Telugu News