మరో కేసులోనూ చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ పిటిషన్

  • ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరిన ఏపీ సీఐడీ
  • ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు
  • అంగళ్లు కేసులోను చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా పేర్కొన్నారు. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిని న్యాయస్థానం ఈ నెల 26న విచారించనుంది. అంగళ్లు కేసులోను చంద్రబాబు వేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 23కు వాయిదాపడింది.


More Telugu News