విటమిన్ మాత్ర అనుకుని ఎయిర్ పోడ్ మింగేసిన మహిళ
- అమెరికాలో ఘటన
- ఎయిర్ పోడ్స్ ప్రొలో ఒకదాన్ని మింగేసిన కెనెడీ అనే మహిళ
- 9 గంటల తర్వాత బయటికి తీసిన వైద్యులు
- కడుపులో ఉన్నప్పుడు కూడా పనిచేసిన ఎయిర్ పోడ్
అమెరికాలో ఇటీవల ఓ మహిళ విటమిన్ మాత్రలు అనుకుని తన ఎయిర్ పోడ్స్ ను మింగేసింది. అలాంటి ఆశ్చర్యకరమైన ఘటన మరోసారి చోటుచేసుకుంది. మో కెనెడీ అనే మహిళ ఎయిర్ పోడ్స్ ప్రొ లో ఒకదాన్ని మింగేసింది. నిద్రలో మధ్యలో మెలకువ రాగా, తాను మింగింది ఎయిర్ పోడ్ నని గ్రహించి తీవ్ర భయాందోళనలకు గురైంది.
అయితే, వాంతి చేసుకోవడం ద్వారా ఆ ఎయిర్ పోడ్ ను బయటికి రప్పించడానికి ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. దాంతో, ఆమెను కోవింగ్టన్ మెడికల్ సెంటర్ కు తరలించారు. ఆమెకు వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించగా... ఉదరంలో ప్రమాదకర రీతిలో చిక్కుకుపోయిన స్థితిలో ఎయిర్ పోడ్ కనిపించింది. దాంతో ఆమెకు శస్త్రచికిత్స అవసరమని భావించి పెద్దాసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కెనెడీ కడుపులోని ఎయిర్ పోడ్ ను బయటికి తీశారు.
అనంతరం, కెనెడీ మాట్లాడుతూ, పనితీరు రీత్యా ఎయిర్ పోడ్స్ ను ఉపయోగించాలని తాను 100 శాతం చెబుతానని, కానీ 1000 శాతం వాటిని తినొద్దని చెబుతానని వెల్లడించింది. అంతేకాదు, కెనెడీ సరదా వ్యాఖ్యలు కూడా చేసింది. కడుపులో ఉత్పత్తి అయ్యే యాసిడ్లను ఎయిర్ పోడ్స్ ప్రొ ఎంతవరకు తట్టుకుంటాయో చూడాలని వాటిలో ఒకదాన్ని మింగానని చమత్కరించింది. దాదాపు 9 గంటల పాటు అది జీర్ణాశయంలో చెక్కుచెదరకుండా ఉందని వివరించింది.
కాగా, ఆ మహిళ మింగిన ఎయిర్ పోడ్ కడుపులో కూడా చక్కగా పనిచేస్తుండడం గుర్తించి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.