శ్రీదేవి సొంత సినిమా అలా ఆగిపోయింది: దర్శకుడు కోదండరామిరెడ్డి

  • చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన కోదండరామిరెడ్డి 
  • 'ఖైదీ' విషయంలో అది అబద్ధమని వెల్లడి 
  • 'ముఠామేస్త్రి' షూటింగులో అలా జరిగిందని వ్యాఖ్య
  • ఆ సినిమాలో లారెన్స్ కనిపిస్తాడని వివరణ

టాలీవుడ్ దర్శకులలో దాసరి నారాయణ రావు .. రాఘవేంద్రరావు తరువాత స్థానంలో కోదండరామిరెడ్డి పేరు వినిపిస్తుంది. చిరంజీవితో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " కృష్ణగారితో తీయవలసిన 'ఖైదీ' సినిమాను చిరంజీవితో చేసినట్టుగా ఒక ప్రచారం ఉంది .. కానీ అందులో నిజం లేదు. ముందుగా చిరంజీవిగారినే అనుకోవడం జరిగింది" అని అన్నారు. 

'ముఠామేస్త్రి' కథను కొంతసేపు వినగానే చిరంజీవిగారు ఓకే చేశారు. చిరంజీవిగారు రాజకీయాల్లోకి వెళ్లడం .. అక్కడి వాతావరణం సరిపడక వెనక్కి వచ్చేయడం ఆ సినిమాలో ఉంటుంది. ఆ తరువాత బయట కూడా అలాగే జరగడం ఆశ్చర్యమే. ఈ సినిమాలో 'ఈ పేటకు నేనే మేస్తిరీ' పాట బాగా పాప్యులర్ అయింది. డాన్సర్స్ లో లారెన్స్ ఉన్నాడనే విషయం నాకు అప్పుడు తెలియదు. ఆ తరువాత ఆయనే నాకు చెప్పాడు" అని అన్నారు. 

"నా హీరోయిన్స్ లో శ్రీదేవి గారు నాతో ఎక్కువ చనువుగా ఉండేవారు. తన సొంత సినిమాకి దర్శకుడిగా ఆమె నన్ను పెట్టుకున్నారు. ఆ సినిమాలో హీరో చిరంజీవిగారు. కొంత షూటింగు అయిన తరువాత, కథపై ఇంకా కసరత్తు జరిగితే బాగుంటుందని ఆమెతో చెప్పాను. అందుకు ఆమె ఒప్పుకున్నారు. ఆ గ్యాప్ అలా కంటిన్యూ అయిపోయింది" అని చెప్పారు. 



More Telugu News