కెనడాతో సంబంధాలు కలిగిన టెర్రరిస్ట్ లు, గ్యాంగ్ స్టర్లు.. జాబితా విడుదల

  • 43 మందితో జాబితా విడుదల చేసిన ఎన్ఐఏ
  • అర్షదీప్ సింగ్, లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ తదితరులు
  • కొందరికి కెనడాలో ఆశ్రయంపై సందేహం
భారత్ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, వేర్పాటు వాదులకు అడ్డాగా కెనడా మారిన విషయం సుస్పష్టం. ఈ విషయాన్ని భారత్ పదే పదే చెబుతూ వస్తూనే ఉంది. అయినా కెనడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సుముఖంగా లేదు. ఓటు బ్యాంకు రాజకీయాలతో అక్కడి సిక్కు సెటిలర్లను ప్రసన్నం చేసుకునేందుకు చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన నిజ్జర్ హత్య రెండు దేశాల సంబంధాలపై ప్రభావం పడేలా దారితీసింది.

 ఈ తరుణంలో భారత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఒక జాబితాను విడుదల చేసింది. మొత్తం 43 మంది పేర్లు, ఫొటోలను విడుదల చేసింది. కెనడాతో సంబంధాలు కలిగిన ఉగ్రవాదులు, నేరస్థులు ఇందులో ఉన్నారు. వీరిలో కొందరు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. ఉగ్రవాద సంస్థలతో వీరిలో కొందరికి సంబంధాలు ఉన్నాయన్నది ఎన్ఐఏ అనుమానం. కొందరు దేశం నుంచి కెనడాకు పారిపోయి ఖలిస్థాన్ వేర్పాటు వాదులతో కలసి పోయారని భావిస్తోంది. 

ఎన్ఏఐ విడుదల చేసిన జాబితాలో అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా, లఖ్ బిర్ సింగ్ లిండా కెనడాలో ఆశ్రయం పొందుతున్నారు. ఇంకా గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, జగదీప్ సింగ్ తదితరుల పేర్లు ఇందులో ఉన్నాయి. 




More Telugu News