ప్రేమించిన వ్యక్తి కోసమే గోవా నుంచి డ్రగ్స్ తెప్పించాను: నిందితురాలు అనురాధ
- భర్తతో దూరంగా ఉంటున్న అనురాధ
- మిత్రుడి ద్వారా గోవాలోని డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రధారి జేమ్స్ తో పరిచయం
- ఆ తర్వాత వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డితో పరిచయం
హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో నిందితురాలైన అనురాధ పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన ప్రియుడు ప్రభాకర్ రెడ్డి కోసమే గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్టు తెలిపింది. అనురాధ స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం. పెళ్లి అయిత తర్వాత కొన్ని కారణాలు వల్ల ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె డ్రగ్స్ కు అలవాటు పడింది. ప్రగతి నగర్ లో ఉంటున్న ఒక మిత్రుడి ద్వారా గోవాలోని డ్రగ్స్ నెట్ వర్క్ సూత్రధారి అయిన జేమ్స్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతడితో ఆమె పరిచయాలు పెంచుకుంది.
ఈ క్రమంలో ఐటీ కారిడార్ లో ఉండే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఆమెకు పరిచయం అయ్యాడు. స్వల్ప కాలంలోనే వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. డ్రగ్స్ గురించి, వాటి సరఫరా గురించి ప్రభాకర్ రెడ్డికి ఆమె వివరించింది. అనంతరం అనురాధ ద్వారా గోవా నుంచి డ్రగ్స్ తెప్పించి, వాటిని తనకు తెలిసిన వ్యక్తులకు ప్రభాకర్ రెడ్డి అమ్మేవాడు. ఈ కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశారు. అనురాధ, ప్రభాకర్ రెడ్డిలను పోలీసులు రెండు రోజుల పాటు విచారించారు. జేమ్స్, హర్షవర్ధన్ రెడ్డి, వినీత్ రెడ్డి, రవిల అడ్రస్ లు తనకు తెలియదని, కేవలం పబ్ లలోనే వారిని కలుసుకునేదాన్నని అనురాధ తెలిపింది.