విజయవాడలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటుడు, 'ఆనంద్' ఫేమ్ రాజా
- 2014లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన ఆనంద్ ఫేమ్
- ఇప్పుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
- అన్ని వర్గాలకు న్యాయం చేసేది కాంగ్రెస్ మాత్రమేనన్న రాజా
ఆనంద్, ఆ నలుగురు సినిమాలతో అలరించిన నటుడు రాజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. సినిమాలకు దూరమైన రాజా... వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో వైసీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన విజయవాడలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో చేరారు.
ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. మణిపూర్ అంశంపై చాలామంది మాట్లాడలేకపోయారన్నారు. మీడియా, ఇతర పార్టీలు ఈ సమస్యను పెద్దగా పట్టించుకోలేదని, కాంగ్రెస్ మాత్రం దీటుగా స్పందించిందన్నారు.