చంద్రబాబు కనిపెట్టిన వాటి పేటెంట్ కోసం కేంద్రం ప్రయత్నించాలి: రాజ్యసభలో విజయసాయిరెడ్డి సెటైర్లు
- రాజ్యసభలో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన వైసీపీ ఎంపీ
- ఐటీని, సెల్ ఫోన్‌ను తానే కనిపెట్టానని చెబుతారన్న విజయసాయిరెడ్డి
- ఎప్పటికప్పుడు టీడీపీ అధినేతపై విజయసాయి సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు ఐటీని, సెల్ ఫోన్‌ను తానే కనిపెట్టానని చెబుతారని, అదే నిజమైతే వాటి పేటెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ సెటైర్లు వేశారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ అధినేతపై విజయసాయిరెడ్డి సెటైర్లు వేస్తుంటారు. సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ వేదికగా పలుమార్లు విమర్శలు గుప్పించడం, చురకలు అంటించడం తెలిసిందే. తాజాగా రాజ్యసభలో టీడీపీ అధినేతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.