కేక పుట్టిస్తున్న రామ్, ఊర్వశీ రౌతేలా ‘కల్ట్ మామా’ స్టెప్పులు
- ‘స్కంద’ నుంచి విడుదలైన ఐటమ్ సాంగ్
- ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
- బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్‌ఇండియా చిత్రంగా విడుదల
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘స్కంద’. బాలకృష్ణతో ‘అఖండ’తో మంచి విజయం సాధించిన శ్రీను మరోసారి తన మార్కు మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్యాన్‌ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రాన్ని మొదట ఈనెల 15న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ‘సలార్’ వాయిదా పడటంతో రిలీజ్ డేట్‌ను మార్చారు. ఈ నెల 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే చిత్రం బృందం ప్రమోషన్స్‌మొదలు పెట్టింది. హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. ఈ సినిమా నుంచి తాజాగా స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
‘కల్ట్ మామా, కల్ట్ మామా, కల్టే.. నువ్వు కాలు దువ్వితే అంతే మామా’ అంటూ సాగే పాటలో రామ్, బాలీవుడ్ ఊర్వశి రౌతేలా అదిరిపోయే స్టెప్పులు వేశారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను హేమ చంద్ర, రమ్య బెహరా, మహా కలిసి పాడారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్‌తో కలిసి శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు.