ఉప్పల్‌లో వరల్డ్ కప్ మ్యాచ్: పాకిస్థాన్–న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- ఈ నెల 29న ఖాళీ స్టేడియంలో జరగనున్న
పాకిస్థాన్–న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ - 28న గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ నేపథ్యంలో భద్రత ఇవ్వలేమన్న పోలీసులు
- ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించాలని అధికారుల నిర్ణయం
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ వేదికల్లో హైదరాబాద్ కూడా ఉంది. కానీ, భారత్ ఆడే మ్యాచుల్లో ఒక్కటి కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు. ఈ విషయంలో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న భాగ్యనగర క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ సంఘం, బీసీసీఐ మరో చేదు వార్త చెప్పాయి. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఈ పోరు ఖాళీ స్టేడియంలో జరగనుంది. ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ -ఉన్ -నబీ పండగ ఉండటంతో ఈ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని నగర పోలీసులు హెచ్‌సీఏకు స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని బీసీసీఐకి తెలిపిన హెచ్‌సీఏ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి బీసీసీఐ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. కాగా, అక్టోబర్ 3న ఆస్ట్రేలియా–పాక్ వార్మప్‌తో పాటు మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఫ్యాన్స్ మధ్యన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.