యాపిల్ తొక్క తీసి తినొచ్చా..?
- యాపిల్ తొక్కలోనూ ఎన్నో పోషకాలు
- యాపిల్ గుజ్జులోనూ ఆరోగ్య ప్రయోజనాలు
- తొక్కతో తీసుకుంటే అధిక ఫలితం
- జీర్ణ సమస్యలున్న వారు తోలుతీసి తినొచ్చు
మనలో కొందరు యాపిల్ ను శుభ్రంగా కడిగి నేరుగా తింటూ ఉంటారు. కొందరు పై తొక్క తీసి తింటుంటారు. యాపిల్ తోలు తీసి తినొచ్చా..? లేక తొక్కతో తింటే ప్రయోజనమా..? ఈ విషయంలో మనలో చాలా మంది అయోమయాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఏది మెరుగైనదనే విషయం చాలా మందికి తెలియదు. కనుక తమకు నచ్చినట్టుగా తింటుంటారు. నిజానికి యపిల్ తొక్కలోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయన్నది వాస్తవం. అందుకే యాపిల్ ను మొత్తంగా తినడమే ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తొక్కతోనే ఎందుకు..?
యాపిల్ లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం తొక్కలోనే ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా తొక్కలోనే ఎక్కువగా ఉంటాయి. కనుక తొక్కతో సహా యాపిల్ తినడమే మంచిది. కాకపోతే తినడానికి ముందు యాపిల్ ను శుభ్రంగా కడగాలి. యాపిల్ నిగనిగలాడేలా కనిపించేందుకు వ్యాక్స్ స్ప్రే చేస్తుంటారు. అది పోయేంత వరకు కడగాలి. పురుగు మందుల అవశేషాలు తొలగిపోయేంతగా శుభ్రం చేసుకోవాలి. ఇక తొక్కతీయని యాపిల్స్ తో మంచి ఫైబర్ లభిస్తుంది. చాలా వరకు ఫైబర్, పోషకాలు తొక్క కిందే ఉంటాయి.
తొక్క తీస్తే నష్టమా?
అరుగుదల విషయంలో ఇబ్బంది పడే వారు యాపిల్ ను తోలు తీసేసి తినొచ్చు. యాపిల్ గుజ్జులోనూ పోషకాలు ఉంటాయి. కాకపోతే ఒకటి రెండు యాపిల్స్ కు పరిమితం కావాలి. యాపిల్ ను తొక్కతీసి తిన్నా పోషకాలు అందుతాయి. తొక్కతో తింటే ఇవి ఇంకాస్త అధికంగా లభిస్తాయి. కనుక వ్యక్తిగత ప్రాధాన్యానికి అనుగుణంగా యాపిల్ తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక మీడియం సైజు యాపిల్ ను రోజువారీగా తినాలన్నది సూచన. రెండు యాపిల్స్ వరకు ఒక రోజులో తినొచ్చు.