తిరుమల నడక దారిలో లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే చిక్కిన మరో చిరుత

  • నమూనాను ల్యాబ్‌కు పంపించనున్న అధికారులు
  • ఆగస్టు 11న చిన్నారి లక్షితపై దాడి చేసి చంపిన చిరుత
  • అప్పటి నుంచి ఏడు చిరుతలను బంధించిన అధికారులు
తిరుమల నడకదారిలో చిరుతలు శ్రీవారి భక్తులను హడలెత్తిస్తున్నాయి. గత నెలలో లక్షిత అనే చిన్నారిపై దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలో అప్రమత్తం అయిన అధికారులు చిరుతలను బంధిస్తున్నారు. ఇప్పటికే పట్టుకున్న రెండు చిరుతలలు లక్షితపై దాడి చేసినవి కావని నిర్థారించుకొని తిరిగి అడవిలో వదిలేశారు. మరో రెండు చిరుతల రిపోర్టులు రావాల్సి ఉండంతో ఎస్వీ జూలో క్వారంటైన్‌లో ఉంచారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా ఓ చిరుత బోనులో చిక్కింది. గత వారం రోజులుగా ఈ చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. 

ఈ చిరుత నమూనాని సైతం అధికారులు ల్యాబ్‌కి పంపనున్నారు. మరోవైపు అలిపిరి కాలిబాట మార్గంలో ఆపరేషన్ చిరుత ఇంకా కొనసాగుతూనే ఉంది. మూడు నెలల వ్యవధిలో అలిపిరి నడక మార్గంలో ఏడు చిరుతలను అటవీ అధికారులు బంధించారు. కాగా, ఆగస్ట్11వ తేదీన అలిపిరి కాలిబాట మార్గంలోని నరసింహ స్వామి ఆలయానికి సమీపంలో అరేళ్ళ బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది.


More Telugu News