రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. హాజరుకావడంపై నేడు టీడీపీ నిర్ణయం
- ఈ నెల 27 వరకు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
- నేడు సమావేశం కానున్న రాష్ట్ర మంత్రి మండలి
- వైసీపీ వ్యూహరచన కమిటీతో జగన్ ప్రత్యేక సమావేశం
రేపటి నుంచి ఈ నెల 27 వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై తెలుగుదేశం పార్టీ నేడు నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రిమండలి నేడు సమావేశం అవుతుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించనున్నారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర బిల్లులపై మంత్రిమండలి సమీక్షించి ఆమోదం తెలపనుంది. అలాగే, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ నేడు వైసీపీ వ్యూహ రచన కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలుస్తోంది.