నేటి యువతరానికి సమంత సలహా
- అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన సమంత
- సోషల్ మీడియాలో ప్రశ్నలు అడిగిన అభిమానులు
- ఓపిగ్గా సమాధానం ఇచ్చిన సమంత
ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. జీవితానికి సంబంధించిన మూడు అంశాలు చెప్పాలని ఓ అభిమాని కోరగా... "నేను ఏదైనా సాధించగలను. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఇదేంటి ఇలా అని ప్రశ్నించడం మానేసి వాస్తవిక దృష్టితో ఆలోచిస్తా. నీతి, నిజాయతీతో ముందుకు వెళతాను" అని వెల్లడించారు.
జీవితంలో వైఫల్యాలు ఎదుర్కొంటున్న యువతకు మీరు ఎలాంటి సలహా ఇస్తారని ప్రశ్నించగా... "ఏదైనా ఒక సమస్య వస్తే, ఏమిటి నా జీవితం ఇలా అయిపోయింది అనుకోవద్దు. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు. యువత జీవితం ఇప్పుడే మొదలవుతుంది... కష్టాలు ఎదురవుతాయి, సమస్యలు పలకరిస్తాయి... వాటికి భయపడి పారిపోవద్దు... ధైర్యంగా ఉండండి. సమస్యలు, కష్టాలే మనల్ని రాటుదేలుస్తాయి. పాతికేళ్ల వయసులో ఉన్నప్పుడు, నేను ఈ స్థాయికి ఎదుగుతానని అనుకోలేదు. జీవితంలో ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటానని కూడా అనుకోలేదు. పాజిటివ్ దృక్పథం చాలా ముఖ్యం" అని వివరించారు.