మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాహుల్ గాంధీ నో కామెంట్!
- మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించేందుకు నిరాకరించిన రాహుల్ గాంధీ
- సరైన సమయం రాకుండా తాను వ్యాఖ్యానించలేనని వెల్లడి
- నేడు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి
మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. ఈ బిల్లుకు మీరు మద్దతిస్తారా? అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. సరైన సమయం రాకుండా దీనిపై తాను వ్యాఖ్యానించలేనన్నారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్‌గా నామకరణం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేన్ల అమలు ఉండనుంది. ఈ బిల్లుపై రేపు లోక్ సభలో, ఎల్లుండి రాజ్యసభలో చర్చ జరగనుంది.