హైదరాబాద్‌లో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ తరహాలో గణేశ్ మండపం
- కూకట్‌పల్లిలోని శాంతి నగర్‌లో ఏర్పాటు
- సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్
- ఈ నెల 28న గణేశ్ నిమజ్జనం
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మూన్ మిషన్‌ను చంద్రుడిపైకి తీసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్ తరహాలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం ఆకట్టుకుంటోంది. అచ్చం అంతరిక్ష నౌకను పోలిన ఈ మండపం కూకట్‌పల్లిలోని శాంతి నగర్‌లో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరుపుకునే గణేశ్ ఉత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈనెల 28న గణేశ్ నిమజ్జనం జరగనుంది.
కాగా, హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చకుండా నిషేధం విధించాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడం పూర్తిగా నిషేధమని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు పౌరులందరూ సహకరించాలని, శాంతి, ప్రశాంతతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.