క్వాష్ పిటిషన్ విచారణకు లంచ్ బ్రేక్.. చంద్రబాబు తరపు వాదనలు పూర్తి

  • ఏపీ హైకోర్టులో ఈరోజు కొనసాగుతున్న విచారణ
  • చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు
  • సీఐడీ తరపున వాదించనున్న ముకుల్ రోహత్గీ
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు వాదనలను కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వేలు వాదనలు వినిపించారు. వీరి వాదనలను విన్న హైకోర్టు విచారణకు భోజన విరామాన్ని ప్రకటించింది. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. విరామం అనంతరం సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్, అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీ ఇరువురూ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు. 

మరోవైపు హరీశ్ సాల్వే తన వాదనలు వినిపిస్తూ, గవర్నర్ అనుమతి లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేశారని...  పీసీ యాక్ట్ 1988 అమెండ్మెంట్ యాక్ట్, సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి అవసరమని చెప్పారు. పోలీసులు ఎవిడెన్స్ ను కలెక్ట్ చేస్తున్నారా లేక ఎవిడెన్స్ ను ప్రిపేర్ చేస్తున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసులో రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. రెండు ప్రైవేట్ పార్టీల మధ్య జీఎస్టీ అంశం కారణంగా మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెట్టడం కాదని లూథ్రా అన్నారు.


More Telugu News