ఒక్క ఉల్లిగడ్డ.. బరువు 9 కిలోలు

  • బ్రిటన్ లో పండించిన ఓ రైతు
  • ప్రత్యేక సాగు విధానాల అమలు
  • ప్రయత్నించిన 12 ఏళ్ల నిరీక్షణ
మన దగ్గర ఉల్లిగడ్డ ఒక్కటి ఎంత బరువు ఉంటుంది? మహా అయితే 100 గ్రాములు లేదా 200 గ్రాములు. కానీ, బ్రిటన్ కు చెందిన ఓ రైతు ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డను పండించి సంచలనం సృష్టించాడు. గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ (65) ఈ భారీ ఉల్లిపాయ ద్వారా ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో దీన్ని ప్రదర్శించాడు. ఇది ప్రపంచ రికార్డు అని హారోగేట్ ఫ్లవర్ షో ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. 

ఇది అద్భుతమని, భారీ ఉల్లిగడ్డ అని యూజర్లు స్పందిస్తున్నారు. ఈ ఉల్లిగడ్డ 8.9 కిలోల బరువు ఉండగా, పొడవు 21 అంగుళాలు. రికార్డును బ్రేక్ చేయడానికి 12 ఏళ్లుగా గ్రిఫిన్ చేస్తున్న ప్రయత్నం ఈ సారి ఫలితాన్నిచ్చింది. అదనపు లైటింగ్, ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి ప్రత్యేక చర్యలతో అతడు ఇంత పెద్ద ఉల్లిగడ్డను పండించాడు. దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా గుర్తించాల్సి ఉంది. గ్రిఫిన్ తండ్రి కూడా పెద్ద సైజు ఉల్లిగడ్డలను సాగు చేసే వారు. ఈ భారీ సైజు ఉల్లిగడ్డలు సైతం వంట చేసుకోతగినవేనని, రుచి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందని గ్రిఫిన్ ప్రకటించారు. సరైన విత్తనాలు, సరైన సాగు విధానాలతోనే ఇలాంటివి సాధ్యమని పేర్కొన్నారు.


More Telugu News