పాత పార్లమెంటు భవనానికి కొత్త పేరును ప్రతిపాదించిన ప్రధాని మోదీ
- పాత పార్లమెంటు భవనంలో చివరిసారిగా సమావేశమైన ఎంపీలు
- సెంట్రల్‌హాల్‌లో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ
- ఈ చారిత్రాత్మక సమయంలో పాత భవనం హుందాతనం కాపాడాలని వ్యాఖ్య
- పాత పార్లమెంటు బిల్డింగ్‌ను రాజ్యాంగ సదనంగా పిలుచుకుందామని సూచన
నేటి నుంచి కొత్త పార్లమెంటులో సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతకుమునుపు, పార్లమెంటు సభ్యులందరూ చివరిసారిగా పాత పార్లమెంటులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రసంగించారు. ‘‘ఈ సందర్భంగా నేనో సూచన చేస్తున్నా. కొత్త పార్లమెంటు భవనంలోకి మారుతున్న సమయంలో పాత భవనం హుందాతనం తగ్గిపోకూడదు. కేవలం పాత పార్లమెంటు భవనంగా మిగిలిపోకూడదు. కాబట్టి..మీరందరూ అంగీకరిస్తే దీన్ని రాజ్యాంగ సదనంగా పిలుచుకుందాం’’ అని మోదీ పేర్కొన్నారు.