కెనడాకు భారత్ దీటైన జవాబు.. ఐదు రోజుల్లో దేశం నుంచి వెళ్లిపోవాలంటూ కెనడా దౌత్యవేత్తకు ఆదేశం

  • కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జార్ హతం
  • ఈ హత్యతో భారత ఏంజెట్లకు సంబంధాలున్నాయంటూ కెనడా ప్రధాని వ్యాఖ్యలు
  • తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉండవచ్చనే ఆరోపణలున్నాయని పేర్కొంటూ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో దానిపై దర్యాప్తునకు ఆదేశించడం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి. ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసిన కెనడా సోమవారం ఓ భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించించింది. దాంతో భారత్-కెనడా సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ట్రూడో ఆరోపణలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. కెనడా చర్యకు ప్రతిగా భారత్‌లో ఆ దేశ సీనియర్ దౌత్యవేత్త ఒలీవర్ సైల్వేస్టర్‌‌ను బహిష్కరించింది. ఐదు రోజుల్లోగా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ భారత విదేశాంగ శాఖ ఆదేశించింది.


More Telugu News