తెలంగాణలో కాంగ్రెస్ 70కి పైగా సీట్లను సాధిస్తుంది: ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
- హైదరాబాద్ సభ గ్రాండ్ సక్సెస్ అన్న రుద్రరాజు
- తెలంగాణ ప్రజల ఎన్నికల మూడ్ అర్థమయిందని వ్యాఖ్య
- తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచుతోంది. వివిధ పార్టీలకు చెందిన నేతల చేరికలతో కాంగ్రెస్ శిబిరం సందడిగా ఉంటోంది. హైదరాబాద్ లో పార్టీ అగ్రనేతలతో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది. మరోవైపు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తాజాగా కరీంనగర్ లో పర్యటించారు.
ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... హైదరాబాద్ సభలో తమ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన హామీలు ప్రజల్లోకి చొచ్చుకుపోతాయని చెప్పారు. బీజేపీ మాదిరి నోటికొచ్చిన హామీలను సోనియా ఇవ్వలేదని... సీడబ్ల్యూసీ సమావేశంలో లోతుగా చర్చించిన తర్వాతే హామీలను ఇచ్చారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ హామీలను అమలు చేసి చూపిస్తామని తెలిపారు.
హైదరాబాద్ సభను చూసిన తర్వాత తెలంగాణ ప్రజల ఎన్నికల మూడ్ ఏ విధంగా ఉందో పూర్తిగా అర్థమయిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ 70కి పైగా సీట్లను కైవసం చేసుకోవడం ఖాయమని, పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని చెప్పారు.