పంజాబ్‌లో కాంగ్రెస్ నేత కాల్చివేత.. తామే చంపేశామన్న ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ
- ఇంటికి వెళ్లి మరీ తుపాకులతో కాల్పులు జరిపిన దుండగులు
- సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఘటన
- తామే చంపామంటూ ఫేస్‌బుక్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్ దల్లా ప్రకటన
- తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపణ
- తన తల్లి పోలీస్ కస్టడీ వెనక అతడి హస్తం ఉండడంతో ప్రతీకారం తీర్చుకున్నామని వివరణ
పంజాబ్‌లోని మోగా జిల్లాలో నిన్న ఓ స్థానిక కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బల్జీందర్ సింగ్ బల్లీ ఇంట్లోకి ప్రవేశించి ఆయనను కాల్చి చంపారు. డాలా గ్రామంలోని బల్జీందర్ ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన రికార్డైంది. బల్జీందర్ అజిత్వాల్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్ దల్లా స్పందించాడు. బల్జీందర్‌ను హతమార్చింది తామేనని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. బల్జీందర్ తన జీవితాన్ని నాశనం చేశాడని, గ్యాంగ్‌స్టర్ కల్చర్‌లోకి తనను బలవంతంగా నెట్టేశాడని ఆరోపించాడు. తన తల్లి పోలీసు కస్టడీ వెనక అతడి హస్తం ఉందని, ప్రతీకారంగానే అతడిని హత్య చేసినట్టు తెలిపాడు.
జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో అర్ష్ దల్లా పేరు కూడా ఉంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా కెనడా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. పంజాబ్‌లో పలు ఉగ్రహత్యల్లో అతడి ప్రమేయం కూడా ఉంది.