ఆసీస్ తో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక

  • సెప్టెంబరు 22 నుంచి ఆసీస్ తో మూడు వన్డేల సిరీస్
  • తొలి రెండు వన్డేల్లో టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం
  • మూడో వన్డేలో తిరిగి కెప్టెన్సీ చేపట్టనున్న రోహిత్ శర్మ
  • తొలి రెండు వన్డేల్లో ఆడే టీమిండియాలో తిలక్ వర్మకు స్థానం 
వచ్చే నెలలో భారత్ లో వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో, అందుకు సన్నాహకంగా టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెప్టెంబరు 22న తొలి వన్డే, సెప్టెంబరు 24న రెండో వన్డే, సెప్టెంబరు 27న మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్ కోసం నేడు టీమిండియాను ఎంపిక చేశారు. 

ఆసీస్ తో తొలి రెండు వన్డేల్లో టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తాడు. రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మూడో వన్డేలో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం చేపడతాడు. తొలి రెండు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో తెలుగుతేజం తిలక్ వర్మ స్థానం దక్కించుకున్నాడు. 

ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు టీమిండియా ఇదే...

కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్ మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఆసీస్ తో మూడో వన్డే ఆడే టీమిండియా ఇదే...

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.


More Telugu News