అమెరికా పార్లమెంటు ఎదుట చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శన
- స్కిల్ కేసులో సెప్టెంబరు 9న చంద్రబాబు అరెస్ట్
- చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
- టీడీపీ అధినేతకు మద్దతుగా విదేశాల్లో ప్రదర్శనలు, ర్యాలీలు
- వాషింగ్టన్ డీసీలో ప్లకార్డులు చేతబూనిన ప్రవాసాంధ్రులు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్కిల్ కేసులో ఈ నెల 9న అరెస్టయిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రెండు వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాగా, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదిస్తూ ప్రపంచ దేశాల్లో తెలుగువారు గళమెత్తుతున్నారు. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి అనేక దేశాల్లో ఆయనకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలోనూ ప్రవాసాంధ్రులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 'వాషింగ్టన్ డీసీ ఎన్నారై టీడీపీ' ఆధ్వర్యంలో అమెరికా పార్లమెంటు ఎదుట ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని పార్లమెంటు భవనం వద్దకు ఏపీ ఎన్నారైలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిలో పలువురు జనసేన మద్దతుదారులు కూడా ఉన్నారు. 'బాబుతో నేను' అనే ప్లకార్డులను ప్రదర్శించారు. సేవ్ ఏపీ, సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేశారు.