త్వరలో టీడీపీలో చేరుతాను: వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
- గణనాథుడి ఆశీస్సులతో చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం
- చంద్రబాబుకు, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని వ్యాఖ్య
- వైసీపీ తనను పార్టీ నుండి చేసిందన్న మేకపాటి
- చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే ఇప్పటికే టీడీపీలో చేరి ఉండేవాడినన్న ఎమ్మెల్యే
త్వరలో తాను తెలుగుదేశం పార్టీలో చేరుతానని వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ... ఆ గణనాథుడి ఆశీస్సులతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సచ్ఛీలుడిగా బయటకు వస్తారని ఆశిస్తున్నానన్నారు. చంద్రబాబుకు, ప్రజలకు మేలు జరగాలని తాను ప్రార్థిస్తున్నానన్నారు. వైసీపీ తనను పార్టీ నుండి సస్పెండ్ చేసిందని, కాబట్టి త్వరలో టీడీపీలో చేరుతానని వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే ఇప్పటికే చేరిక పూర్తయి ఉండేదన్నారు. టీడీపీ నుంచి సమాధానం వచ్చాక, చంద్రబాబు బయటకు వచ్చాక తాను ఆ పార్టీలో చేరుతానన్నారు.
తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, అయినప్పటికీ తన గ్రాఫ్ బాగాలేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో తాను తప్ప ఎవరూ గెలవలేరన్నారు. టీడీపీలో చేరాక, పార్టీ అధినేత టిక్కెట్ ఇస్తే తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఏపీలో ప్రస్తుత పాలనలో ధర్మం, న్యాయం లేదని ప్రజలకు అర్థమైందని, చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అవి సాధ్యమన్నారు.