ధోనీ టీమిండియా కోసం తన పరుగులను త్యాగం చేశాడు: గంభీర్
- కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ
- బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వచ్చిన ఝార్ఖండ్ డైనమైట్
- కెప్టెన్ కావడం వల్లే ధోనీ నెం.3 స్థానాన్ని వదులుకున్నాడన్న గంభీర్
- నెం.3 స్థానంలో వచ్చుంటే టన్నుల కొద్దీ పరుగులు సాధించేవాడని వెల్లడి
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ స్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంలు కురిపించాడు. ధోనీ టీమిండియా విజయాల కోసం తన అంతర్జాతీయ పరుగులను త్యాగం చేశాడని తెలిపారు. ధోనీ కెప్టెన్ కాకుండా ఉంటే కచ్చితంగా నెం.3 స్థానంలో బ్యాటింగ్ కు దిగేవాడని, దాంతో టన్నుల కొద్దీ పరుగులు సాధించి ఉండేవాడని గంభీర్ పేర్కొన్నారు.
అయితే, ధోనీ కెప్టెన్ కావడం వల్ల జట్టు కోసం బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వచ్చేవాడని వివరించారు. తద్వారా జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేసేవాడని స్పష్టం చేశారు.
ధోనీ హయాంలో ఎంతోమంది యువ బ్యాటర్లు అవకాశాలు దక్కించుకోవడం తెలిసిందే. వారు ఎక్కువ ఓవర్లు ఆడేందుకు వీలుగా ధోనీ వారిని బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు పంపించేవాడు. తాను ఆరోస్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడు. అయినప్పటికీ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా పేరు తెచ్చుకోవడం ధోనీకే సాధ్యమైంది.