కోహ్లీ వాకింగ్ స్టయిల్ ను అనుకరించి అందరినీ నవ్వించిన ఇషాన్ కిషన్... వీడియో ఇదిగో!
- నిన్న కొలంబోలో ఆసియా కప్ ఫైనల్
- బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం
- కోహ్లీ బాడీ లాంగ్వేజిని ప్రదర్శించిన ఇషాన్ కిషన్
నిన్న కొలంబోలో ఆసియా కప్ ఫైనల్ ముగిసిన అనంతరం బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వాకింగ్ స్టయిల్ ను యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అనుకరించడం అందరినీ అలరించింది.
ఇషాన్ కిషన్ అచ్చం కోహ్లీ బాడీ లాంగ్వేజిని ఫాలో అవుతూ నడిచాడు. అది చూసిన ఇతర క్రికెటర్లు పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం "నా నడక అలా ఉండదు" అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా, ఆ కుర్ర క్రికెటర్ మరోసారి కోహ్లీలా నడిచి వినోదం పంచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. మొత్తమ్మీద భారత క్రికెటర్ల మధ్య ఉన్న ఆరోగ్యకర వాతావరణానికి ఈ వీడియో అద్దం పడుతుంది.
ఆదివారం నాడు కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించడం తెలిసిందే. తొలుత సిరాజ్ 6 వికెట్లు తీసి లంక వెన్నువిరవగా, ఆ ఆతిథ్య జట్టు 15.2 ఓవర్లలో 50 పరుగులకు కుప్పకూలింది.
అనంతరం 51 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 6.1 ఓవర్లలోనే ఛేదించి 8వ సారి ఆసియా కప్ ను ఒడిసిపట్టింది.