రాష్ట్రాల ఏర్పాటుకు ఇదే వేదికైంది.. పార్లమెంట్ పాత భవనంపై మోదీ
- రేపటి నుంచి కొత్త భవనంలో సమావేశాల నిర్వహణ
- పాత భవనంలో తన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న మోదీ
- దేశ సువర్ణ అధ్యయనానికి ఈ భవనం సాక్షిగా ఉందని వ్యాఖ్య
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మాట్లాడారు. ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్లమెంట్ పాత భవనంతో తన జ్ఞాపకాలను సభలో పంచుకున్నారు. తెలగాణ వంటి కొత్త రాష్ట్రాల ఏర్పాటు జరిగింది ఇక్కడేనని చెప్పారు. పార్లమెంట్ తరలివెళ్లినా ప్రస్తుత భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇదొక కీలక ఘట్టమని మోదీ వివరించారు. కాగా, మంగళవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో నిర్వహించనున్నారు.
ఈ పార్లమెంట్ భవనం ఆలోచన బ్రిటీష్ వారిదే అయినప్పటికీ.. నిర్మాణంలో భారతీయులు చెమటోడ్చారని ప్రధాని మోదీ అన్నారు. 75 ఏళ్లుగా ఈ భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రశంసించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మన దేశంవైపే చూస్తోందని, వివిధ రంగాలలో మన విజయాలు ప్రపంచాన్ని అబ్బుర పరుస్తున్నాయని చెప్పారు. ఇటీవలి చంద్రయాన్ -3 ప్రాజెక్టుతో మన సత్తాను ఇస్రో ప్రపంచ దేశాలకు చాటిచెప్పిందని మోదీ పేర్కొన్నారు.