చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కెనడాలో భారీ నిరసన ప్రదర్శన.. ఫొటోలు ఇవిగో!

  • దేశవిదేశాల్లో కొనసాగుతున్న నిరసనలు
  • టొరొంటోలో 3 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ
  • భారత రాయబారికి వినతిపత్రం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా, గల్ఫ్ దేశాలు, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో ప్రవాసాంధ్రులు, టీడీపీ అభిమానులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బాబుకు అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.

    తాజాగా, కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. ఈ ప్రదర్శనలో స్థానికులతోపాటు ఆసియా, అమెరికన్లు కూడా పాల్గొన్నారు. నిజాయతీపరులకు న్యాయం జరగాలని నినదించారు. 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించిన అనంతరం టొరొంటోలోని భారత రాయబార కార్యాలయానికి చేరుకుని భారత రాయబారికి వినతిపత్రం అందించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయన వెంటనే జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని అందులో కోరారు. 






More Telugu News