లక్షితను పొట్టనబెట్టకున్న చిరుతను గుర్తించడంలో ఉత్కంఠ
- ఇటీవల తిరుమల నడకదారిలో చిరుత దాడి
- లక్షిత అనే బాలికను ఈడ్చుకెళ్లిన చిరుత
- అలిపిరి నడక మార్గం వెంబడి తిరిగే చిరుతలను బంధించిన అధికారులు
ఇటీవల తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ చిరుతపులి లక్షిత అనే బాలికను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. తల్లిదండ్రులతో కలిసి నడకమార్గంలో వెళుతున్న లక్షితను చిరుత అడవిలోకి లాక్కెళ్లి అంతమొందించింది. ఈ ఘటనతో రంగంలోకి దిగిన టీటీడీ, అటవీశాఖ సిబ్బంది నడక మార్గం వెంట సంచరిస్తున్న పలు చిరుతలను బంధించారు.
అయితే వాటిలో రెండు చిరుతలు లక్షితపై దాడి చేయలేదని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ నిపుణులు నిర్ధారించారు. వాటిలో ఒక చిరుతను గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యానికి తరలించారు. మరో చిరుతను విశాఖలోని ఇందిరా గాంధీ జూకి తరలించారు.
మరో రెండు చిరుతలను తిరుపతి ఎస్వీ జూలోని క్వారంటైన్ కు తరలించారు. ఈ రెండు చిరుతలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ల్యాబ్ రిపోర్టు వస్తే వీటిని ఇతర ప్రాంతాలకు తరలించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.