మన దేశ చరిత్రలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒక కీలక ఘట్టం: ప్రధాని మోదీ
- నేడు హైదరాబాద్ విమోచన దినోత్సవం
- దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామన్న మోదీ
- వల్లభాయ్ పటేల్ కు నివాళులు అర్పిద్దామని పిలుపు
మన దేశ చరిత్రలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒక కీలకఘట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇవాళ (సెప్టెంబరు 17) మనం హైదరాబాదులో పరిఢవిల్లుతున్న ఐక్యతా స్ఫూర్తిని, దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలను సగర్వంగా స్మరించుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ ను విలీనం చేయడంలో ఆదర్శవంతమైన పాత్ర పోషించిన సర్దార్ పటేల్ కు నివాళులు అర్పిద్దామని మోదీ పిలుపునిచ్చారు.
ఈ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం హైదరాబాదులో అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని వివరించారు. ఈ మేరకు హైదరాబాదులో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఫొటోలను కూడా మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.