సిరాజ్ సంచలన బౌలింగ్ పై రాజమౌళి స్పందన
- ఆసియా కప్ లో చాంపియన్ గా నిలిచిన భారత్
- భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్
- 6 వికెట్లతో లంక వెన్నువిరిచిన హైదరాబాదీ పేసర్
- మా టోలీచౌకి కుర్రాడు అంటూ రాజమౌళి సంబరం
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కెరీర్ లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయడం తెలిసిందే. ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో సిరాజ్ 6 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ బుల్లెట్ బంతులకు శ్రీలంక బ్యాట్స్ మెన్ నుంచి సమాధానమే లేదు. సిరాజ్ సంచలన బౌలింగ్ ప్రదర్శన పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
కాగా, సిరాజ్ సూపర్ బౌలింగ్ అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని కూడా ఆకట్టుకుంది. "సిరాజ్ మియా" అంటూ రాజమౌళి సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"సిరాజ్ మా టోలీచౌకి కుర్రాడు. ఇవాళ ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో మెరిశాడు" అని సంబరపడిపోయారు. అంతేకాదు, సిరాజ్ ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆటగాడు అని, తన బౌలింగ్ లో ప్రత్యర్థి ఆటగాడు కొట్టిన షాట్ ను ఆపేందుకు బౌండరీ లైన్ వరకు పరిగెత్తాడని రాజమౌళి కొనియాడారు.