తెలంగాణ సమాజంలో చిచ్చు పెడితే సహించం: జగదీశ్ రెడ్డి

  • అమిత్ షా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపాటు
  • కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలుసని ఎద్దేవా
  • గాంధీలు చెప్పే మాటలు వినే స్థితిలో ప్రజలు లేరని వ్యాఖ్య
తెలంగాణ విమోచన దినం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపోహలను సృష్టిస్తున్నారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. చరిత్రలోని పాత గాయాలను మళ్లీ రగిలించి, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వారు దేశ మనుగడకు ప్రమాదకరమని అన్నారు. అన్నదమ్ముల్లా కలిసున్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెడితే సహించబోమని హెచ్చరించారు. 

కర్ణాటకలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ చరిత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ పగటి కలలు కంటోందని ఎద్దేవా చేశారు.


More Telugu News