ఇండియా కూటమిలోకి ఎంఐఎంను ఆహ్వానించకపోవడంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన
- ఇండియా కూటమిని తాను కేర్ చేయనన్న ఒవైసీ
- దేశంలో రాజకీయ శూన్యత ఉందని వ్యాఖ్య
- కేసీఆర్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ ఈ శూన్యతను భర్తీ చేస్తుందని ఒవైసీ
ఇండియా కూటమిలోకి ఎంఐఎంను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిని తాను అసలు కేర్ చేయనని చెప్పారు. వాస్తవానికి దేశంలో రాజకీయ శూన్యత ఉందని... ఆ శూన్యతను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని థర్డ్ ఫ్రంట్ భర్తీ చేస్తుందని భావించానని చెప్పారు. ఈ రాజకీయ శూన్యతను ఇండియా కూటమి భర్తీ చేయలేదని అన్నారు.
ఇండియా కూటమిలో కేసీఆర్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలోని ఎన్నో పార్టీలు భాగస్వాములు కాదని చెప్పారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ గురించి ఒవైసీ మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. గత నెలలో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ నాయకత్వం వహిస్తే థర్డ్ ఫ్రంట్ లోకి జంప్ అయ్యేందుకు ఎన్నో రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.