రాజమండ్రి జైలు లోపలికి అనుమతిస్తే భద్రతా లోపాలు చూపిస్తా: యనమల రామకృష్ణుడు

  • రాజమండ్రిలో యనమల ప్రెస్ మీట్
  • జైలులో చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందన్న యనమల
  • క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి ఏ విధంగా భద్రత కల్పిస్తాడన్న టీడీపీ నేత
దోపిడీ వ్యవస్థకు జగన్ అధిపతి అని, యువతను దెబ్బతీయడమే జగన్ క్రిమినల్ ఆలోచన అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. మచ్చలేని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని, స్కిల్ డెవలెప్మెంట్ లో అవినీతి జరగలేదని సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలే చెప్తున్నాయని స్పష్టం చేశారు. 

రాజమండ్రి జైలులో చంద్రబాబు భద్రత పట్ల యనమల ఆందోళన వ్యక్తం చేశారు. జైలు లోపలికి తనను పంపిస్తే భద్రతా లోపాలు చూపిస్తానని స్పష్టం చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న జగన్ వంటి వ్యక్తి చంద్రబాబుకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు? అని యనమల ప్రశ్నించారు. 

రాజమహేంద్రవరంలోని విద్యానగర్ లో లోకేశ్ బస చేసే విడిది కేంద్రం వద్ద యనమల ఇవాళ మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. 

యనమల వ్యాఖ్యల హైలైట్స్...

• సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని తప్పుడు ఆరోపణలతో మచ్చలేని చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్న భావన ప్రజల్లో ఉంది.
• రాష్ట్రానికి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చిన వ్యక్తిని జైల్లో పెట్టినందుకు ప్రజలే స్వచ్ఛందంగా నిరసన తెలుపుతున్నారు. స్కిల్ డెవెలెప్మెంట్ పథకం మంచి పథకం. మన రాష్ట్రం, దేశంలోనే కాదు... ప్రపంచంలోనే ఒక మంచి సంస్థ సీమెన్స్. 
• విద్యార్థులు, నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడానికి రాష్ట్రానికి ఈ సంస్థను తీసుకొచ్చాం. స్కిల్ డెవెలెప్మెమెంట్ కు యువత వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అందువల్లే తక్కువ ఖర్చుతో సీమెన్స్ సంస్థ ద్వారా పేద యువతకు ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగాలొస్తాయన్న ఉద్దేశంతో స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాం. 
• తండ్రి అధికారంతో వేలకోట్లు దోచుకున్న జగన్ ఒక గజదొంగ. దాన్ని మేము గతంలోనే నిరూపించాం. గజదొంగకు తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో జగన్ సీఎం కాకముందే చూపించారు. రూ.43 వేల కోట్ల ఆస్తులను సీబీఐ అటాచ్ చేసింది. 
• ఈడీ ఛార్జ్ షీట్, సీబీఐ ఛార్జ్ షీట్లు 26 ఉన్నాయి... 16 నెలలు జైల్లో ఉన్నాడు... అలాంటి గజదొంగకు ప్రజలకు మళ్లీ తాళాలు ఇచ్చారు. 
• జగన్ తండ్రి చనిపోయారన్న సింపతితోనే గతంలో ఓట్లు వేశారు.
• కంబోడియాలో ఎన్నికలు జరిగాయి. అక్కడ హాన్ సేన్ ఎన్నికల కమిషన్ సాయంతో ప్రతిపక్షాలు లేకుండా గెలిచారు. దాన్ని ఆదర్శంగా జగన్ తీసుకున్నారేమో అనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే డబ్బుతో ఎన్నికలు చేయవచ్చని లక్ష కోట్లు దోచుకున్నాడు. 
• ప్రజా ధనాన్ని లూటీ చేసి, దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు చూస్తున్నాడు. జగన్ పై ఉన్న వ్యతిరేకత ప్రపంచంలో ఎవరిపైనా లేదు. రాజకీయాల్లో ఇంత చెడు క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరూ లేరు. మలేషియన్ ప్రెసిడెంట్ ను గతంలో కరెప్టెడ్ లీడర్ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు జగన్ ను అనుకుంటున్నారు. 
• వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుంది. చంద్రబాబును బద్నాం చేసేందుకు జగన్ ఏం చెప్తే సీఐడీ అది చేసింది. 
• జగన్ పత్తిత్తు అయితే దోచుకున్న డబ్బులు రాష్ట్ర అప్పులకు కట్టాలి. రాష్ట్రంలో 40కి పైగా స్కిల్ డెవలెప్మెంట్ సెంటర్లు పెట్టామని సీమన్స్ సంస్థవాళ్లే చెప్పారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా 26 సార్లు చంద్రబాబుపై విచారణ చేయించారు... ఏమీ చేయలేదు. 
• అవినీతి జరగలేదని సీమన్స్, డిజైన్ టెక్ స్పష్టంగా చెప్తోంది..కానీ జగన్ సీఐడీ, వాళ్ల మనుషులు ఒక ప్లాన్ వేసుకుని ఇరికించాలనేదే వారి ప్రయత్నం. ఎటువంటి అక్రమ కేసులనైనా న్యాయపరంగా ఎదుర్కొంటాం’’అని యనమల ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News