‘గేమ్ చేంజర్’ పాట లీకేజ్.. క్రిమినల్ కేసు నమోదు
- సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడంతో సంచలనం
- ఐపీసీ 66(సీ) కింద క్రిమినల్ కేసు దాఖలు చేసిన చిత్ర బృందం
- లీకైన కంటెంట్ ను వ్యాప్తి చేయవద్దంటూ ప్రకటన
రామ్ చరణ్ నటించి, త్వరలో విడుదల కానున్న ‘గేమ్ చేంజర్’ సినిమా నిర్మాతలు న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ సినిమాలోని ఓ పాట సామాజిక మాధ్యమాల్లో లీక్ కావడమే దీనికి నేపథ్యంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో కియారా అద్వానీ తదితర ప్రముఖ నటులు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించినది అంటూ సామాజిక మాధ్యమాలపై లీకైన ఓ సాంగ్ సంచలనం సృష్టించింది. దీంతో చిత్ర నిర్మాణ బృందం న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది. ‘‘మా సినిమా గేమ్ చేంజర్ లోని కంటెంట్ ను లీక్ చేసిన వారిపై ఐపీసీ 66 (సీ) సెక్షన్ కింద క్రిమినల్ కేసు దాఖలు చేయడం జరిగింది. చట్టవిరుద్ధంగా లీకైన నాణ్యతలేని కంటెంట్ ను వ్యాప్తి చేయడానికి దూరంగా ఉండాలని కోరుతున్నాం’’అంటూ ప్రొడక్షన్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
గేమ్ చేంజర్ సినిమాని రూ.15 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం శంకర్, ఆయన టీమ్ చెన్నై నుంచి చురుగ్గా పనిచేస్తోంది. సినిమాకు సంబంధించిన పాట కూడా అక్కడి నుంచే లీక్ అయినట్టు సమాచారం. నిజానికి అది పూర్తి పాట కాదని, పాటకు సంబంధించిన ప్రాథమిక డమ్మీ వెర్షన్ అని చిత్ర వర్గాలు తెలిపాయి.