ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆటో చార్జీల్లో డిస్కౌంట్

  • సూరత్ పట్టణ ఆటో డ్రైవర్ల వినూత్న నిర్ణయం
  • 73వ పుట్టిన రోజు సందర్భంగా 73 ఆటోల్లో 100 శాతం డిస్కౌంట్
  • 1000 ఆటోల్లో 30 శాతం డిస్కౌంట్
  • ప్రధాని పట్ల అభిమానం చాటుతున్న ఆటోవాలాలు
ప్రధాని నరేంద్ర మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ లోని సూరత్ పట్ణణ ఆటో డ్రైవర్లు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ప్రయాణికులకు చార్జీల్లో డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆటో డ్రైవర్లను సూపర్ పశ్చిమ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ (బీజేపీ) అభినందించారు. ఆటో డ్రైవర్ల చార్జీల తగ్గింపు నిర్ణయాన్ని సైతం ఎమ్మెల్యేనే ప్రకటించారు. 

‘‘1,000 మంది ఆటో రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టిన రోజు నాడు చార్జీల్లో 30 శాతం తగ్గింపునిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ 73వ పుట్టిన రోజు సందర్భంగా చార్జీల్లో నూరు శాతం తగ్గింపును ప్రకటించిన 73 మంది ఆటో రిక్షా డ్రైవర్లకు ధన్యవాదాలు’’అని పూర్ణేష్ మోదీ ప్రకటించారు. అంటే 73వ పుట్టిన రోజుకు గుర్తుగా 73 మంది తమ ఆటోల్లో ఆదివారం ప్రయాణికులను ఉచితంగా గమ్యస్థానాలకు తీసుకెళ్లనున్నారు. 

మరోవైపు ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ బీజేపీ రెండు వారాల ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. సేవా పఖ్వారా పేరుతో రక్తదాన శిబిరాల నిర్వహణ, హెల్త్ క్యాంప్ లు, పరిసరాల పరిశుభ్రత తదితర కార్యక్రమాలు నిర్వహించనుంది.


More Telugu News