కవితను జైలుకు పంపేందుకు కూడా కేసీఆర్ సిద్ధమయ్యారు: రేవంత్ రెడ్డి
- కవిత అరెస్టయితే బీఆర్ఎస్ కు సానుభూతి వస్తుందని కేసీఆర్ భావించారన్న రేవంత్
- కేసీఆర్ అనుచరుడే కిషన్ రెడ్డి అని వ్యాఖ్య
- కేసీఆర్ అవినీతిపై మోదీ, అమిత్ షా విచారణకు ఆదేశించలేదని విమర్శ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కవిత అరెస్ట్ అయితే బీఆర్ఎస్ కు సానుభూతి వస్తుందని కేసీఆర్ భావించారని, అందుకే ఆమెను జైలుకు పంపేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారని అన్నారు. కేసీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వేర్వేరు కాదని... కేసీఆర్ అనుచరుడే కిషన్ రెడ్డి అని ఆరోపించారు.
సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతున్న సమయంలోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్ పై మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలు విమర్శలు చేస్తారే తప్ప... కేసీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశించలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఈడీ, సీబీఐయే కాదు... ఈగ కూడా వాలలేదని అన్నారు.