చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో నిరసనలు.. ఫొటోలు ఇవిగో

  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దేశవిదేశాల్లో నిరసనలు
  • దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు
  • సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వస్తుందని నినాదాలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విదేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికాలోని హాఫ్‌వే హౌస్‌ 78 లారెన్స్ స్ట్రీట్‌లో టీడీపీ ఎన్నారై ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 


ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో దుబాయ్‌లోనూ పెద్ద ఎత్తున నిరనసలు జరిగాయి. ఇక్కడి జెబెల్ అలీ హిందూ ఆలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీడీపీ సానుభూతిపరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సైకో ప్రభుత్వం ఇంటికెళ్లిపోవడం పక్కా అని నినదించారు.




More Telugu News