మోకాళ్లపై కూర్చోమని గ్రామస్థుడికి శిక్ష.. సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్‌పై వేటు
- ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ జిల్లాలో మదన్‌పూర్ లో ఇటీవల వెలుగు చూసిన ఘటన
- శ్మశానవాటిక కోసం మరో చోట స్థలం కేటాయించాలంటూ గ్రామస్థుల విజ్ఞప్తి
- ఈ క్రమంలో ఓ గ్రామస్థుడిని మోకాళ్లపై కూర్చోవాలంటూ శిక్ష విధించిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్
- ఘటన తాలుకు వీడియో వైరల్, ఎస్‌డీఎంను విధుల నుంచి తప్పించిన వైనం
న్యాయం కోరుతూ వచ్చిన గ్రామస్థుడిని మోకాళ్లపై కూర్చోమని శిక్ష విధించిన సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్‌పై (ఎస్‌డీఎమ్) తాజాగా వేటుపడింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. బరేలీ జిల్లాలోని మదన్‌గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తమ గ్రామంలోని శ్మశానవాటికను ఇతరులు ఆక్రమించారని ఎస్‌డీఎమ్‌కు ఫిర్యాదు చేశారు. మరోచోట స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు.
ఈ క్రమంలో ఎస్‌డీఎమ్ ఉదిత్ పవార్ గ్రామస్థుల్లో ఒకరిని మోకాళ్లపై కోడిలా కూర్చోమంటూ శిక్ష వేయడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా మెజిస్ట్రేట్ రంగంలోకి దిగి ఉదిత్ పవార్‌ను విధుల నుంచి తప్పించి జిల్లా యంత్రాంగానికి అటాచ్ చేశారు. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని ఉదిత్ పవార్ చెప్పుకొచ్చారు. తాను కార్యాలయానికి వచ్చేటప్పటికే గ్రామస్థుడు ఆ విధంగా కూర్చుని ఉన్నాడని తెలిపారు.