ఆసియా కప్ ఫైనల్ ముంగిట టీమిండియాలో ఒక మార్పు
- నిన్న బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గాయపడిన అక్షర్ పటేల్
- ఫైనల్ కోసం వాషింగ్టన్ సుందర్ కు పిలుపు
- రేపు భారత్, ఆతిథ్య శ్రీలంక మధ్య ఆసియా కప్ టైటిల్ సమరం
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రేపు (సెప్టెంబరు 17) ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టీమిండియాలో ఒక మార్పు చోటుచేసుకుంది! బంగ్లాదేశ్ తో సూపర్-4 మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయపడ్డాడు. అతడు ఫైనల్ కు అందుబాటులో ఉండే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, అక్షర్ స్థానంలో మరో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పించారు. గతరాత్రి బంగ్లాదేశ్ తో మ్యాచ్ హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్షర్ బ్యాటింగ్ చేస్తుండగా చిటికెన వేలికి గాయమైంది. ఆ తర్వాత లంక ఫీల్డర్ విసిరిన బంతి గాయమైన వేలికే తగిలింది. అక్షర్ అలాగే బ్యాటింగ్ కొనసాగించినప్పటికీ, గాయం తీవ్రత దృష్ట్యా అతడు ఫైనల్లో ఆడే అవకాశాలు కనిపించడంలేదు. పైగా, తొడ కండరాల గాయం కూడా అక్షర్ ను బాధిస్తుండడంతో, వాషింగ్టన్ సుందర్ ను జట్టులో చేర్చినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.