చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా... హైదరాబాదులో కుటుంబ సభ్యులతో కలిసి కార్లలో రోడ్లపైకి వచ్చిన ఐటీ ఉద్యోగులు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్న ఐటీ ఉద్యోగులు
  • ఇవాళ, రేపు హైదరాబాదులో కార్ల ర్యాలీ చేపట్టాలని ఐటీ ఉద్యోగుల నిర్ణయం
టీడీపీ అధినేత అక్రమం అంటూ ఐటీ ఉద్యోగులు గళమెత్తుతున్నారు. ఐటీ ఉద్యోగులు నిన్న బెంగళూరులో భారీ ర్యాలీ నిర్వహించడం తెలిసిందే. ఇవాళ హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సొంత కార్లలో రోడ్లపైకి వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. 

చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ జీవితాలకు దారి చూపిన వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదని గళం వినిపించారు. ప్రజల్లో ఉండాల్సిన నాయకుడిని జైలులో ఉంచుతారా? విజనరీ లీడర్ ను అక్రమ కేసులతో వేధిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, ఐటీ ఉద్యోగులు నానక్ రామ్ గూడ నుంచి కార్లతో ర్యాలీగా బయల్దేరగా, పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓఆర్ఆర్ పై కార్ల ర్యాలీకి అనుమతి లేదని నిరసనకారులకు పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్-ముంబయి జాతీయ రహదారిపై ఎగ్జిట్-3 వద్ద ర్యాలీకి అంతరాయం ఏర్పడింది. ఐటీ ఉద్యోగులను ఎగ్జిట్-3 నుంచి వారి కార్లతో సహా బయటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఇవాళ, రేపు 10 వేల మందితో కార్ల ర్యాలీ నిర్వహించాలని ఐటీ ఉద్యోగులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News