పవన్ కల్యాణ్ తో ఎన్నికలపై చర్చించాను: బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
- గతరాత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
- పవన్ ను కలవడం అద్భుతంగా అనిపించిందని వెల్లడి
- ఏపీతో బ్రిటన్ సంబంధాల బలోపేతంపైనా చర్చించామన్న ఓవెన్
తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్ గతరాత్రి పవన్ కల్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన ఆయన కొంతసమయం పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషన్ రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్ కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశంపై గారెత్ విన్ ఓవెన్ ఇవాళ ఎక్స్ లో స్పందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలవడం అద్భుతంగా అనిపించిందని తెలిపారు. భారత్ లో త్వరలో రాబోయే పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించామని ఓవెన్ వెల్లడించారు. అంతేకాదు, ఏపీతో బ్రిటన్ సంబంధాల బలోపేతం చేయడానికి ఉన్న అవకాశాలపైనా చర్చ జరిగిందని వివరించారు.