నంద్యాలలో కోటి రూపాయలకు పైగా విలువైన సెల్‌ఫోన్ల చోరీ
- రూ. 1.3 కోట్ల విలువైన సెల్‌ఫోన్ల లోడుతో హర్యానా నుంచి బెంగళూరుకు కంటెయినర్
- ఓబుళాపురం మిట్ట సమీపంలో రోడ్డు పక్కన ఆపి సెల్‌ఫోన్లను మరో వాహనంలోకి మార్చిన డ్రైవర్లు
- కంటెయినర్‌ను అక్కడే వదిలి పరారీ
దాదాపు రూ. 1.3 కోట్ల విలువైన సెల్‌ఫోన్ లోడుతో హర్యానా నుంచి బెంగళూరుకు వెళ్తున్న కంటెయినర్‌ను దాని డ్రైవర్లే దోచేశారు. కర్నూలు జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఓబుళాపురం మిట్ట సమీపంలో ఈ నెల 11న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.
బెంగళూరు తీసుకెళ్లాల్సిన కంటెయినర్‌ను రోడ్డుపక్కన ఆపిన డ్రైవర్లు అందులోని కోటి రూపాయలకుపైగా విలువైన సెల్‌ఫోన్లను మరో వాహనంలోకి మార్చేశారు. ఆపై కంటెయినర్‌ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. నాగాలాండ్‌కు చెందిన కంటెయినర్ యజమాని ఫిర్యాదుతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.