ఏఏజీగా ఉండి జగన్ సేవకుడిని అని చెప్పుకోవడం దారుణం: ఆనం రామనారాయణరెడ్డి

ఏఏజీగా ఉండి జగన్ సేవకుడిని అని చెప్పుకోవడం దారుణం: ఆనం రామనారాయణరెడ్డి
  • ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఆనం ఫైర్
  • న్యాయశాస్త్రం, చట్టాలకు విలువ ఇచ్చే మనిషి కాదని విమర్శ
  • ఇలాంటి వ్యక్తుల వల్ల న్యాయశాస్త్రంపై నమ్మకం పోతోందని మండిపాటు
ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ద్వారా తాను పునర్జన్మ పొందానని సుధాకర్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆయన న్యాయశాస్త్రం, చట్టాలకు విలువ ఇచ్చే వ్యక్తి కాదని విమర్శించారు. ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్న సుధాకర్ రెడ్డి ఆయన విలువను ఆయనే దిగజార్చుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు, వసతులు పొందుతూ... తాను జగన్ సేవకుడిని అని చెప్పుకోవడం దారుణమని అన్నారు. తాను ఏఏజీ అని కాకుండా... వైసీపీ కార్యకర్తను అని ఆయన చెప్పుకోవడం బెటర్ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత తన వక్తిగత సెక్యూరిటీని 8 మందికి పెంచుకున్నాడని మండిపడ్డారు. 



More Telugu News