తమిళనాడులో 50 శాతం సీట్లను డిమాండ్ చేసిన అమిత్ షా

  • ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన పళనిస్వామి
  • గంటకు పైగా కొనసాగిన సమావేశం
  • విజయకాంత్ పార్టీని కూటమిలోకి చేర్చుకోవాలనే అంశంపై ఏకాభిప్రాయం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా షాకిచ్చారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 40 లోక్ సభ స్థానాల్లో (తమిళనాడు 39, పుదుచ్చేరి 1) తమకు 20 సీట్లను కేటాయించాలని అమిత్ షా స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. బీజేపీకి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలను తమకు కేటాయించాలని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు, అన్నాడీఎంకే కూటమిలో ప్రస్తుతమున్న మిత్రపక్షాలను కూడా కొనసాగించాలని సూచించారు. సినీ నటుడు విజయకాంత్ పార్టీ డీఎండీకేను కూటమిలోకి తీసుకోవడంపై ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. వీరిద్దరి మధ్య భేటీ గురువారం రాత్రి ఢిల్లీలో జరిగింది. లోక్ సభ ఎన్నికలపై వీరిద్దరూ గంటకు పైగా చర్చించారు. మరోవైపు పళనిస్వామి ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా తమ పార్టీ ఎంపీలను వెంటపెట్టుకుని వెళతారు. అయితే, ఈసారి మాత్రం ఒంటరిగానే అమిత్ షాను కలిశారు.


More Telugu News