చంద్రబాబు స్వేచ్ఛను హరించడం దురదృష్టకరం: కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు
- చంద్రబాబుకు బీజేపీ సీనియర్ నేత సురేశ్ ప్రభు మద్దతు
- టీడీపీ అధినేత స్థాయి, వయసులను అనుసరించి వ్యవహరించి ఉండాల్సిందని వ్యాఖ్య
- ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం ఉండాలన్న సురేశ్ ప్రభు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సురేశ్ ప్రభు మద్దతు ప్రకటించారు. చంద్రబాబు తన స్వేచ్ఛకు దూరంకావడం దురదృష్టకరమంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు.
‘‘నేను ప్రయాణంలో ఉన్నాను. ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్న నాయకుడు చంద్రబాబుకు చట్టబద్ధంగా లభించిన స్వేచ్ఛను దూరం చేసిన దురదృష్టకరమైన ఘటన గురించి ఇప్పుడే విన్నా. ప్రజాబలం ఉన్న పార్టీ అధినేతగా చంద్రబాబు స్థాయి, వయసుకు తగ్గట్టుగా ఆయనతో వ్యవహరించి ఉండాల్సింది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే స్వేచ్ఛ ఉండాలని ప్రజాస్వామ్యం చెబుతోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.