హైదరాబాద్, బెంగళూరుల్లోని ఆ ఉద్యోగులందరికీ నారా లోకేశ్ థ్యాంక్స్
- హైదరాబాద్, బెంగళూరు సహా వివిధ నగరాల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉద్యోగుల నిరసన
- ఎక్స్ వేదికగా వివిధ నగరాలకు చెందిన నిరసన ఫోటోలను పంచుకున్న లోకేశ్
- మీలో ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామని వ్యాఖ్య
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌ను నిరసిస్తూ ఐటీ నగరాలకు ప్రసిద్ధి చెందిన బెంగళూరు, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో టెక్కీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నిరసనలో పాల్గొంటున్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు.
చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్, బెంగళూరు, ఇతర నగరాలు లేదా పట్టణాలలో రోడ్లపైకి వచ్చిన వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు నేను అభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. బేషరతుగా మీ ప్రేమ, ఆప్యాయతలను కురిపించినందుకు మీలో ప్రతి ఒక్కరికీ మేం ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. వీరందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ముగించారు.
ఏపీలో అవినీతిపరులైన పాలకులు, నీతిపరులను జైలుకు పంపుతున్నారని, స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి స్కామ్ లేదని, ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించిందని మరో ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.